Draupadi Murmu: భద్రాద్రి రామాలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాచలం చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వచ్చారు.

Updated : 28 Dec 2022 12:56 IST

భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాచలం చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వచ్చారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. 

అనంతరం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారిని తీర్థప్రసాదాలు అందజేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని