Srisailam: శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Updated : 26 Dec 2022 16:47 IST

శ్రీశైలం:నంద్యాల జిల్లా శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శ్రీశైలం ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. 

అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశారు. మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని