Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతీ అతిథి గృహంలో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Updated : 05 Dec 2022 12:27 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల(Tirumala)లోని పద్మావతీ అతిథిగృహంలో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి తితిదే (TTD) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. 

తొలుత వరాహ స్వామిని.. అనంతరం శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ద్రౌపదీ ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తితిదే ఛైర్మన్‌, ఈవో తదితరులు శ్రీవారి చిత్రపటం, స్వామి వారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని