Draupadi Murmu: యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రిలో పర్యటించారు. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 30 Dec 2022 12:39 IST

యాదగిరిగుట్ట: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గవర్నర్‌ తమిళిసైతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు