Ramnath kovind: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ ..

Updated : 13 Feb 2022 15:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముచ్చింతల్‌ చేరుకున్నారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. రామానుజుల స్వర్ణమూర్తిని 120కిలోల బంగారంతో రూపొందించారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తున దీన్ని కొలువుదీర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని