క్రమంగా మెరుగుపడుతోన్న రాష్ట్రపతి ఆరోగ్యం

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బైపాస్‌ సర్జరీ అనంతరం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని రాష్ట్రపతి భవన్‌ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Updated : 03 Apr 2021 16:17 IST

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బైపాస్‌ సర్జరీ అనంతరం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని రాష్ట్రపతి భవన్‌ శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ‘రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎయిమ్స్‌లో ఐసీయూ నుంచి ఓ ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. కోవింద్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొంత సమయం ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు’ అని రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌లో వెల్లడించింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మార్చి 26న ఛాతిలో ఏర్పడిన నొప్పి కారణంగా దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడి వైద్యులు ఆయనకు సాధారణ పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స కోసం ఎయిమ్స్‌కు సిఫారసు చేశారు. దీంతో మార్చి 30న దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ పూర్తయిన అనంతరం కోవింద్‌ స్పందిస్తూ.. తనకు ఆస్పత్రిలో అంకితభావంతో సేవలందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని