అక్కడ జైలు నుంచి తప్పించుకుంటే పట్టుకోరు!

పోలీసులకు పట్టబడ్డ నేరస్థులంతా వారు చేసిన నేరాలను బట్టి జైలు శిక్ష అనుభవిస్తుంటారు. కొంతమంది జైల్లోనే మగ్గిపోవడం ఇష్టంలేక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటివారిపై పోలీసులు మరింత నిఘా పెడుతుంటారు. ఖైదీ ఎక్కడున్నా వెతికి పట్టుకొని జైల్లో

Updated : 28 Mar 2021 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలీసులకు పట్టబడ్డ నేరస్థులంతా వారు చేసిన నేరాలను బట్టి జైలు శిక్ష అనుభవిస్తుంటారు. కొంతమంది జైల్లోనే మగ్గిపోవడం ఇష్టంలేక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటివారిపై పోలీసులు మరింత నిఘా పెడుతుంటారు. ఖైదీ ఎక్కడున్నా వెతికి పట్టుకొని జైల్లో వేస్తారు. దీంతో చేసిన నేరంతోపాటు జైలు నుంచే పారిపోయే ప్రయత్నం చేసినందుకు మరికొంత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో ఖైదీలు జైలు నుంచి పారిపోతే వారికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లే. వారికి విధించిన జైలు శిక్షను కోర్టులు మాఫీ చేస్తాయట.

జర్మనీ, బెల్జియం, ఆస్ట్రియా, మెక్సికో, డెన్మార్క్‌ దేశాలు ఖైదీలు జైలు నుంచి పారిపోవడాన్ని నేరంగా పరిగణించవు. ఎందుకంటే ‘మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. అది మనిషి స్వభావం. దాని కోసం తాపత్రయపడటంలో ఎలాంటి తప్పులేదు’ అనే సూత్రాన్ని ఆ దేశాలు నమ్ముతున్నాయి. అందుకే జైల్లో ఉండే ఖైదీ స్వేచ్ఛ కోసం జైలు నుంచి పారిపోతే.. దానిని ఆయా దేశాలు నేరంగా భావించట్లేదు. ఖైదీని అన్వేషించి పట్టుకోరు. జర్మనీ దేశంలోని చట్టసభ్యులు 1880లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్నే పలు దేశాలు పాటిస్తున్నాయి. అయితే, ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. జైలు ఆస్తులను ధ్వంసం చేయకూడదు. అంటే.. జైలు గోడలు బద్దలుకొట్టినా, తలుపులు, కిటికీలు విరగొట్టినా నేరం చేసినట్లే. జైలు నుంచి పారిపోవడంలో ఇతరుల సాయం తీసుకున్నా.. వారిని బందీలుగా చేసుకొని పారిపోవాలని ప్రయత్నించినా పోలీసులు వారిని పట్టుకొని మళ్లీ జైలుకే పంపుతారు. ఆఖరికి ఖైదీ దుస్తులతో పారిపోయినా నేరమే. ఎందుకంటే ఆ దుస్తులు కూడా జైలు ఆస్తే కదా. అంటే, ఖైదీ దుస్తులు విప్పేసి.. నగ్నంగా పైనా పేర్కొన్న ఏ తప్పు చేయకుండా పారిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారికే జైలు శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. వాటిలో ఏ తప్పు చేసినా మళ్లీ ఊచలు లెక్కించాల్సిందే. ఈ విధంగా పారిపోవడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ చట్టాలని ఇంకా కొనసాగిస్తున్నారు. విచిత్రంగా ఉంది కదా..!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని