Yadadri: రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం: ఈవో

రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.

Updated : 31 Mar 2022 19:54 IST

యాదాద్రి: రేపట్నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్టు చెప్పారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా దేవస్థామే భరిస్తుందని తెలిపారు. త్వరలో స్వామి వారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభిస్తామని ఈవో వెల్లడించారు.

మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ప్రకటించింది. ఉదయం 4 - 4.30 వరకు సుప్రభాతం, 4.30 - 5.00 వరకు బిందె తీర్థం, ఆరాధన, 5 - 5.30: బాలభోగం, 5.30- 6 వరకు పుష్పాలంకరణ సేవ, 6- 7.30 వరకు సర్వదర్శనం, 7.30- 8.30 వరకు నిజాభిషేకం. 8.30- 9 వరకు సహస్రనామార్చన, 9- 10 వరకు బ్రేక్ దర్శనం, ఉదయం 10- 11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్ల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని