Amaravati: ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

రాజధానిలోని ఆర్‌-5జోన్‌లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

Updated : 19 May 2023 17:55 IST

అమరావతి: రాజధానిలో ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్‌-5జోన్‌లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు. రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాల మేరకు గృహనిర్మాణశాఖ ఈ ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆర్‌-5 జోన్‌లో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన 51,392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, ప్రస్తుతం 47,017 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. షీర్‌ వాల్‌ టెక్నాలజీ ఉపయోగించి సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే ఇంటి మంజూరు పత్రాలను కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల సంఖ్య, ఇళ్ల నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనల సంఖ్యలో వ్యత్యాసం ఉండటంతో 4,375 మంది లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మరో వైపు ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధికి సీఆర్డీఏ రూ.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే లే అవుట్‌ల అభివృద్ధి కోసం రూ.20కోట్లను యుద్ధ ప్రాతిపదికన సీఆర్డీఏ ఖర్చు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని