కార్మిక సంఘాల సమ్మె.. తెలుగు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రైతులు, 

Published : 28 Mar 2022 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. రైతులు, కార్మికులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు నిర్వహించారు. రోజురోజుకీ నిత్యవసర, ఇంధన ధరలు పెరిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు రోజుల ఆందోళనలో భాగంగా విజయవాడలో బిసెంట్‌ రోడ్‌ నుంచి లెనిన్‌ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తణుకులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు, విజయనగరం, అనంతపురం తిరుపతి తదితర నగరాల్లో కార్మికులు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణలో కూడా ర్యాలీలు చేపట్టారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని