Updated : 26/06/2021 13:57 IST

TS news: రైతు ప్రయోజనాలను కాపాడాలి

హైదరాబాద్‌: సాగు చట్టాలు రద్దు, విద్యుత్ బిల్లు ఉపస‌ంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష రైతు సంఘాలు నిరసనకు దిగాయి. కార్పోరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నేతలు వెంకట్, సాగర్, పశ్య పద్మ, సంధ్య, విస్సా కిరణ్ కుమార్, కొండల్ రెడ్డితోపాటు 
ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాలకు కాపాడాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నారాయణ మూర్తిసహా పలువురిని అరెస్టు చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని