CPS: సీపీఎస్ రద్దు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా దీక్షలు
సీపీఎస్ (CPS) రద్దు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు. సీపీఎస్ రద్దు చేస్తారా?లేదా? అనే విషయాన్ని స్వయంగా సీఎం జగన్ (CM Jagan) వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అమరావతి: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా సంకల్ప దీక్షలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం చర్చి కూడలి వద్ద సంకల్ప దీక్ష చేపట్టారు. సీపీఎస్ బదులు జీపీఎస్ తీసుకువస్తామనడం అంగీకార యోగ్యం కాదన్నారు. కడప కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష చేపట్టారు. సీపీఎస్ రద్దు చేస్తారా? లేదా? అనేది స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని యూటీఎఫ్ కేంద్ర కార్యాలయం ఆవరణలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు అధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. ఈ నెల మూడో తేదీన గన్నవరంలో సంకల్పదీక్ష తలపెడితే.. అనుమతించకపోగా.. ఉపాధ్యాయుల్ని అక్రమంగా అరెస్టు చేశామన్నారు. నెల్లూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద కూడా ఉపాధ్యాయులు సంకల్ప దీక్ష చేపట్టారు. ఐదో తేదీ వచ్చినా.. ఇంకా జీతాలు వేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరితో పోరాటాలను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్