Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ యువత నిరసన ర్యాలీ చేపట్టింది.
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ ఓయూలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ చేపట్టింది. ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు గాంధీభవన్‌లో జీహెచ్‌ఎంసీ నాయకులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ.. నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి, నిరసన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగర నాయకులంతా నిరసనల్లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా
-
General News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను