PSR Anjaneyulu: సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు

ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు యత్నించారు.

Published : 07 Jul 2024 14:38 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు యత్నించారు. అపాయింట్‌మెంట్‌ లేదని సీఎంవో అధికారులు చెప్పినా హైదరాబాద్‌లోని సీఎం ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టారు. ఆదివారం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండుసార్లు అక్కడికి వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సీఎం ఇంటి గేటుదగ్గరే పీఎస్‌ఆర్‌ను భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైకాపా కోసం పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు