‘తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం’

జీహెచ్‌ఎంపీ పరిధిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి ..

Published : 25 Aug 2020 14:18 IST

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంపీ పరిధిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా పరీక్షల సంఖ్య గతంలో కంటే పెంచామని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10.21 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనల మేరకే బిల్లులు వేయాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయస్థాయి రేటు కన్నా తక్కువగానే ఉందన్నారు. కరోనా నివారణకు చర్యలు తీసుకోవట్లేదని తప్పుడు ప్రచారం చేస్తే బాధనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఈ సీజన్‌లో చికెన్‌ గున్యా, డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా  వంటి సీజనల్‌ జ్వరాలు  ప్రబలే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా, సీజనల్‌ జ్వరాల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని, ఎలాంటి క్షణాలు ఉన్నా సమీపంలోని ప్రభుత్వం ఆరోగ్యకేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని