Published : 18 Aug 2022 22:42 IST

అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్‌ఛేంజ్‌లో విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు

హైదరాబాద్‌: తెలంగాణకు ఎక్స్‌ఛేంజ్‌లో విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు గురువారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం రోజుకు 5 నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్‌ కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు ఎక్స్‌ఛేంజ్‌లో విద్యుత్‌ కొనుగోలు నిలిచిపోనుంది. దీనిపై కేంద్రంలోని ఉన్నతాధికారులతో తెలంగాణ విద్యుత్‌ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. డిమాండ్‌ బట్టి తెలంగాణ డిస్కమ్‌లు ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఎక్స్‌ఛేంజ్‌ విధానంలో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈవిషయమై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వినియోగదారులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని