Food Testing: ఆహారంలో కల్తీని కనిపెట్టేయండి ఇలా!

ప్రస్తుత రోజుల్లో మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో కల్తీ ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతిని మనం రోగాల బారిన పడుతున్నాం. అందుకే ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’

Updated : 08 Dec 2022 16:13 IST

సులభమైన పరీక్షతో స్వచ్ఛతను తెలుసుకోవచ్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత రోజుల్లో మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో కల్తీ ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతిని మనం రోగాల బారిన పడుతున్నాం. అందుకే ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ఆహారానికి సంబంధించి ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీది అని తెలుసుకునేందుకు ఓ చిన్న ప్రయోగంతో వీడియో రూపొందించింది. 

రంగు బఠాణీలను గుర్తించడమెలా..!

గాజు గ్లాస్‌లో సగం నీరు నింపి అందులో బఠాణీలు వేసి అరగంట ఉంచండి. ఈలోపు నీరు ఆకుపచ్చరంగులోకి మారితే.. కృత్రిమ రంగును వాడినట్లు అర్థం. రంగుమారకుండా ఉంటే.. అవి స్వచ్ఛమైనవి.

తేయాకు పరీక్ష 

ముందుగా రెండు ఫిల్టర్‌ పేపర్లు తీసుకొని వాటిపై తేయాకును ఉంచండి. దానిపై కాస్త తేమ వచ్చేందుకు కొద్దిగా నీరు చల్లండి. ఆ తరువాత ట్యాప్‌ వాటర్‌ కింద ఫిల్టర్‌ పేపర్‌ని వాష్‌ చేయండి. ఆ పేపర్‌పై మరకలను గమనించండి. తేయాకు కనుక కల్తీ అయితే.. చిక్కటి బ్రౌన్‌ మరకలు ఉంటాయి. స్వచ్ఛమైనదైతే ఫిల్టర్‌పేపర్‌పై అసలు మరకలు పడవు

మిరియాలను ఇలా గుర్తించండి

మిరియాల్లో  స్వచ్ఛతను కనిపెట్టడం చాలా తేలిక. మిరియాలను ఓ టేబుల్‌ పైపోసి వాటిని బొటన వేలితో గట్టిగా నొక్కండి. కల్తీ మిరియాలైతే.. వెంటనే చితికిపోతాయి. స్వచ్ఛమైనవి గట్టిగా ఉంటాయి.

కారాన్ని ఇలా  పరీక్షించండి..

ముందుగా ఓ గ్లాస్‌ నీటిలో టీ స్పూన్‌ కారం వెయ్యండి. ఆ మిశ్రమాన్ని కొద్దిగా చేతిపై తీసుకొని రుద్దండి. అది గట్టిగా ఉంటే ఇటుకపొడి కలిసిందని అర్థం. మెత్తగా ఉందంటే అందులో సోప్‌ స్టోన్‌ ఉందని అర్థం. ఈ రెండు పదార్థాలతో శరీరానికి ప్రమాదమే.

కల్తీ పసుపు ఇలా..

 రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్‌ స్పూన్‌ పసుపు వేయండి. స్వచ్ఛమైనది అయితే లేత పసుపు రంగులోకి మారి నీటి అడుగుకు చేరుతుంది. కల్తీది గ్లాసులోని నీటిని చిక్కటి పసుపు రంగులోకి మార్చేస్తుంది.  





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని