Telangana: విద్యార్థులను సైబర్‌ వారియర్లుగా తీర్చిదిద్దడం అభినందనీయం: పీవీ సింధు

అంతర్జాల వినియోగంతోపాటు సైబర్‌ నేరాలూ పెరిగాయని ఒలింపిక్‌ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. సైబర్‌ నేరాలపై తెలంగాణ మహిళా భద్రత విభాగం అవగాహన

Published : 30 Jan 2022 01:47 IST

హైదరాబాద్‌: అంతర్జాల వినియోగంతోపాటు సైబర్‌ నేరాలూ పెరిగాయని ఒలింపిక్‌ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. సైబర్‌ నేరాలపై తెలంగాణ మహిళా భద్రత విభాగం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇంటర్నెట్‌తో ఉన్న మంచి, చెడును పిల్లలు గ్రహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను సైబర్‌ వారియర్లుగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్‌ ఎంతో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు.  సదస్సులో అదనపు డీజీ స్వాతి లక్రా, డీజీఐ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని