Tirumala : తిరుమలలో ఏకాంతంగానే రథసప్తమి వేడుకలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ సందర్భంగా వాహనసేవలను ఆలయంలోనే

Updated : 31 Jan 2022 20:39 IST

తిరుమల : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ సందర్భంగా వాహనసేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ రోజున ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

సూర్యప్రభ వాహనం: ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు
చిన్నశేష వాహనం : ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
గరుడ వాహనం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
హనుమంత వాహనం : మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు
చక్రస్నానం : మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు

రంగనాయకుల మండపంలో..

కల్పవృక్ష వాహనం : సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు
సర్వభూపాల వాహనం : సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు
చంద్రప్రభ వాహనం : రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని