కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థులపై కఠిన చర్యలు!

ఇటీవల కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమైంది.

Updated : 19 Sep 2023 18:55 IST

వరంగల్‌: ఇటీవల కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సభ్యులు విచారణ జరిపారు. అనంతరం విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఈ నెల 14న హాస్టల్‌లో ర్యాగింగ్‌ జరిగిందని నిర్థారించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురిపై కేసులు పెట్టినట్టు చెప్పారు. ఏడాది పాటు హాస్టల్‌లో అనుమతి నిరాకరించామని.. ఏడుగురినీ మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు.  మరో 20మంది విద్యార్థులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తమ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ జరగడం ఇదే తొలిసారన్నారు. ర్యాగింగ్ ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు