ఆ నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయం: హైకోర్టుకు తెలిపిన రఘురామ న్యాయవాది

కస్టోడియల్‌ టార్చర్‌ వ్యవహారంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది.

Updated : 08 Jun 2023 15:07 IST

అమరావతి: కస్టోడియల్‌ టార్చర్‌ వ్యవహారంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. గుంటూరు ఆస్పత్రిలో గతంలో జరిగిన వైద్య పరీక్షల నివేదిక భద్రతపై ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు నివేదికలను భద్రపరచాలని పిటిషన్‌లో ఎంపీ పేర్కొన్నారు. దీనిపై రఘురామ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 

కార్డియాలజీ, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు. రెండేళ్లు పూర్తికావడంతో నివేదిక ధ్వంసానికి అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయమవుతాయని.. వీటన్నింటినీ భద్రపరిచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వెంటనే దీనిపై లిఖితపూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని గుంటూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, ఆరోగ్యశాఖ కమిషనర్లను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని