జగన్‌ అక్రమాస్తుల కేసులపై రఘురామ పిల్‌ 

జగన్‌ అక్రమాస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా..

Updated : 03 Jul 2021 19:20 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయన్నారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని