Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్‌.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ

కస్టడీలో తనను సీఐడీ సిబ్బంది చిత్రహింసలు పెట్టారని, ఆ ఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 08 Feb 2023 21:57 IST

అమరావతి: కస్టడీలో తనను సీఐడీ సిబ్బంది చిత్రహింసలు పెట్టారని, ఆ ఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రజా ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మీడియా, బహిరంగ సమావేశాల్లో మాట్లాడినందుకే కేసు నమోదు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు పిటిషనర్‌పై కక్షకట్టారన్నారు. రఘురామ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం... కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని