Raghurama: సికింద్రాబాద్‌కు తరలింపు
గుంటూరు: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జైలు వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. కొద్ది సేపటి క్రితమే ఆయన్ను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దగ్గర ఉండి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌కు ఈ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయి. దీంతో రఘురామను రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణ రాజు కారెక్కుతూ మీడియాకు అభివాదం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ న్యాయాధికారి తిరుమలగిరి ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీఎస్ పర్యవేక్షణలో ఆయన్ను తరలిస్తున్నారు. ఈ నెల 21 వరకు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎస్ సహా నలుగురు అధికారులకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి మెయిల్, ఫోన్ వచ్చినట్టు సమాచారం. దీంతో రఘురామ తరలింపుపై సీఎస్ తెలంగాణ అధికారులతోనూ సంప్రదించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Viral-videos News
Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!