ఆ ముసాయిదాను వెనక్కు తీసుకోవాలి: రాహుల్‌గాంధీ

పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై ఎదురుదాడి పెంచారు. దేశాన్ని దోచుకునేలా ముసాయిదాను రూపొందించినట్లు ఆరోపించారు.

Published : 10 Aug 2020 23:57 IST

దిల్లీ: పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దేశాన్ని దోచుకునేలా ముసాయిదాను రూపొందించినట్లు ఆరోపించారు. పర్యావరణ విధ్వంసాన్ని ఆపేందుకు గాను ఈ ముసాయిదాను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. తన సూటుబూటు స్నేహితులైన పారిశ్రామికవేత్తలు దేశ వనరులను కాజేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ ముసాయిదాను ప్రమాదకరమైనదిగా  ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో మార్పులు చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ  పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, సూచనలు, వినతులకు కేవలం 20రోజుల గడువు మాత్రమే విధించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని