Railway Projects: ఆరు రైల్వే ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ వాటా ఇవ్వాలి: అశ్వనీ వైష్ణవ్

రూ.15 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఆరు ప్రధానమైన రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తన వంతు వాటా సమకూర్చాల్సి ఉందని రైల్వేశాఖ రాజ్యసభలో తెలియజేసింది.

Updated : 03 Apr 2022 06:07 IST

దిల్లీ: రూ.15 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఆరు ప్రధానమైన రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తన వంతు వాటా సమకూర్చాల్సి ఉందని రైల్వేశాఖ రాజ్యసభలో తెలియజేసింది. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఏపీలో 15,846.35 కోట్లతో చేపట్టిన 6 ప్రాజైక్టులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు రూ.486.63 కోట్లు ఇచ్చిందన్నారు. ఇంకా ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రూ.5 వేల కోట్లు సమకూర్చాల్సి ఉందన్నారు. రూ.2,155 కోట్లతో చేపట్టిన భద్రాచలం-కొవ్వూరు లైన్‌లో 50 శాతం వాటా భరించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. 2,643 కోట్లతో చేపట్టిన నడికుడి-శ్రీకాళహస్తి కొత్తలైన్  కోసం ఉచితంగా భూమి సహా 50 శాతం ఖర్చును ఏపీ సర్కార్ సమకూర్చాల్సి ఉందన్నారు. ఆ మార్గానికి ఇప్పటివరకు రూ.6 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని