హైదరాబాద్‌లో వర్షపాతం వివరాలివీ..
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇటీవల రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు హైదరాబాద్ జంటనగరాలు అతలాకుతలమైన నేపథ్యంలో చినుకు పడితేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం మరోసారి నగరంలోని పలుచోట్ల............
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇటీవల రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు జంటనగరాలు అతలాకుతలమైన నేపథ్యంలో చినుకు పడితేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం మరోసారి నగరంలోని పలుచోట్ల కురిసిన భారీ వర్షంతో అవస్థలు పడుతున్నారు. ఈ వర్షంతో రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వరదనీటిని తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జంటనగరాల్లో ఈ రోజు రాత్రి 7గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..
నగరంలో అత్యధికంగా ఉప్పల్ పరిధిలోని బండ్లగూడలో 102.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, సరూర్‌నగర్ భవానీనగర్‌లో 93.8 మీ.మీలు; అబ్దుల్లాపూర్‌మెట్‌లో 91 మి.మీ, హయత్‌నగర్‌లో 89 మి.మీ; మేడిపల్లిలో 70.5 మి.మీ, ఘట్కేసర్లో 68మి.మీ; ఎల్బీనగర్లో 68 మి.మీ, ఇబ్రహీపట్నం 62.5, సైదాబాద్ 59మి.మీ, బాలాపూర్ 54.8మి.మీ, గండిపేట 48.5మి.మీ, చార్మినార్ 46.8మి.మీ, ముషీరాబాద్ 46.5మి.మీ, రాజేంద్రనగర్ 30.3మి.మీ, కూకట్పల్లి 28మి.మీ, శేరిలింగంపల్లి 27.3మి.మీ, మారేడ్‌పల్లి 23మి.మీ, ఖైరతాబాద్ 20.5మి.మీ, సికింద్రాబాద్ 20మి.మీ, హిమాయత్‌నగర్ 19.3మి.మీ, ఖుత్బుల్లాపూర్ 16.8మి.మీ, నాంపల్లి 16 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ