Telangana News: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. తడిసి ముద్దయిన జనం

ఈరోజు సాయంత్రం కురిసిన మోస్తరు వర్షానికి హైదరాబాద్‌ వాసులు తడిసి ముద్దయ్యారు. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో అవస్తలు పడ్డారు. 

Updated : 13 Dec 2022 18:46 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం పడింది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, కోఠి, హిమాయత్‌నగర్‌, సుల్తాన్‌ బజార్‌, ట్యాంక్‌బండ్‌, సోమాజీగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో అవస్తలు పడ్డారు. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు దక్షిణాది నుంచి తెలంగాణలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని