Telangana News: రాష్ట్రమంతటా రుతుపవనాలు... హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

తెలంగాణ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణమీదుగా

Updated : 16 Jun 2022 18:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణమీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 9మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. నేడు, రేపు  రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేకచోట్ల పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ...

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, చింతల్‌, బాలానగర్‌, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని