Updated : 19 Jun 2022 14:15 IST

Rains: హైదరాబాద్‌, విజయవాడలో వర్షం.. వాహనదారులకు ఇబ్బందులు

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌లో వర్షం కురిసింది.

వర్షం జల్లులతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల నాలాలు పొంగిపొర్లడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.

  

విజయవాడలోనూ భారీ వర్షం..
విజయవాడలోనూ ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. వరదనీటితో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని