Telangana News: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్‌, ఎంజే మార్కెట్‌, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి,

Updated : 03 Jul 2022 16:33 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్‌, ఎంజే మార్కెట్‌, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లిబర్టీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న భాజపా విజయ సంకల్ప సభకు భారీగా తరలివస్తున్న కార్యకర్తలు వర్షం రాకతో అసౌకర్యానికి గురయ్యారు. సభా ప్రాంగణంలో రెయిన్‌ ప్రూఫ్ టెంట్లు ఏర్పాట్లు చేశారు.

రాగల 3రోజులు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ఈరోజు ఝార్ఖండ్‌ దాని పరిసరాల్లో కొనసాగుతూ సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఝార్ఖండ్‌ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఝార్ఖండ్‌ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని సంచాలకులు పేర్కొన్నారు. తెలంగాణ వైపునకు కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని