Updated : 29 Jul 2022 19:14 IST

Rain: మూసీకి వరద తగ్గింది... హైదరాబాద్‌లో వర్షం మళ్లీ మొదలైంది

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, అచ్యుత్‌రెడ్డి మార్గ్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, కవాడిగూడ, బోలక్‌ పూర్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, దోమల గూడ, ఉప్పల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మూసారంబాగ్‌ వంతెనపై రాకపోకలకు అంతరాయం..

ఇటీవల కురిసిన భారీ వర్షానికి మూసీనదిపై ఉన్న మూసారంబాగ్‌ వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రెండు రోజుల పాటు మూసివేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురవడంతో వంతెనపై నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు మళ్లీ అంతరాయమేర్పడింది. కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు బ్రిడ్జిపై నిలిచిన నీటిని తొలగించి ట్రాఫిక్‌ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts