Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. రహదారులు జలమయం

నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

Updated : 23 Jun 2024 19:18 IST

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్‌, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా.. మరోవైపు రోడ్డుపై వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరదనీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు