TS News: ఆకాశంలో అద్భుత దృశ్యం!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. హైదరాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి సహా పలు చోట్ల సూర్యుని చుట్టూ ఇంద్ర ధనస్సు మాదిరిగా..

Updated : 02 Jun 2021 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. హైదరాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి సహా పలు చోట్ల సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా ఓ వలయం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచి ఇలా కనిపిస్తోందని కొందరు స్థానికులు చెప్పారు. ఈ సుందర దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్లలో బంధించుకున్నారు.

దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినపుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని