ప్రీతి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి: కాళోజీ వర్సిటీకి రాజ్‌భవన్‌ లేఖ

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్‌భవన్‌ లేఖ రాసింది.

Published : 28 Feb 2023 14:34 IST

హైదరాబాద్‌: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్‌భవన్‌ లేఖ రాసింది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని పేర్కొంది. ర్యాగింగ్‌, వేధింపుల తరహా ఘటనలు జరిగినపుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్‌ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని రాజ్‌భవన్‌ కోరింది. మెడికోలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పనిగంటలు.. వైద్యకళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

ప్రీతిని నిమ్స్‌కు అత్యంత కీలకమైన సమయాన్ని కోల్పోయినట్లు లేఖలో రాజ్‌భవన్‌ పేర్కొంది. ఆమెను నిమ్స్‌కు తరలించకుండా వరంగల్‌ ఎంజీఎంకే వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలను తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిందని అభిప్రాయపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని