HMDA: సొంతింటి కల సాకారమయ్యే వేళ... రేపటి నుంచే రాజీవ్‌స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నోటిఫికేషన్
హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నోటిఫికేషన్ ఇవ్వగా రేపటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి.
అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపు ఉదయం 9గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ ప్రక్రియ ఫేస్బుక్, యూట్యూబ్‌లలో లైవ్‌స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 27న పోచారం, 28న బండ్ల గూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల ఫ్లాట్ల కోసం డ్రా తీయనున్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఆధార్ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్