కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ

Updated : 29 Nov 2023 12:29 IST

హైదరాబాద్‌ : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సోదరీమణలు.. తమ సోదరులకు రాఖీలు కడుతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత ప్రగతిభవన్‌లో రాఖీ కట్టారు. పండగ శుభాకాంక్షలు తెలిపిన కవిత.. తన సోదరుడి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సునీతారెడ్డి తదితరులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు.

మంత్రి హరీశ్‌రావుకు తెరాస మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ఆత్మీయ రక్షాబంధన్‌తోపాటు స్వీయరక్షణ పాటించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని