
Published : 18 Apr 2021 17:07 IST
విశాఖలో ఉక్కు పరిరక్షణ కమిటీ భారీ ర్యాలీ
పాల్గొ్న్న బీకేయూ నేత రాకేశ్ టికాయత్
విశాఖ: నగరంలోని బీచ్ రోడ్డులో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా కాలినడకన ఉద్యమకారులు ముందుకు సాగారు. సాయంత్రం ఆర్కే బీచ్లో రైతు, కార్మిక శంఖారావం సభ జరగనుంది. ఈ ర్యాలీకి దిల్లీలో రైతుల తరఫున ఆందోళన నిర్వహించిన రైతు సంఘం నేతలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సహా పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి
Tags :