Ts News: ఉద్రిక్తంగా నర్సుల ఆందోళన

విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద నర్సుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర

Updated : 09 Jul 2021 18:26 IST

హైదరాబాద్‌: విధుల్లోకి తీసుకోవాలంటూ పొరుగు సేవల నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద నర్సుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన నర్సులు.. ఆ తర్వాత అక్కడ నుంచి కోఠి డీఎంఈ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో నర్సులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. తొలగించిన నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకొని జీతాలు చెల్లించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో సేవ చేసిన వారిపై ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. 20 మంది నర్సులను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో మమత అనే నర్సుకు గాయాలైనట్లు తెలుస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని