ఏనుగు మీద నుంచి కిందపడ్డ రామ్‌దేవ్‌ బాబా

యోగా గురు రామ్‌దేవ్‌ బాబా మరోసారి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారారు. ఓ ఏనుగుపై ఆయన కూర్చొని యోగా చేస్తుండగా.. అదుపుతప్పి కింద పడిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు.....

Published : 15 Oct 2020 00:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యోగా గురు రామ్‌దేవ్‌ బాబా మరోసారి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారారు. ఓ ఏనుగుపై ఆయన కూర్చొని యోగా చేస్తుండగా.. అదుపుతప్పి కింద పడిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ, ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని రామన్‌ రెటి ఆశ్రమంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

22 సెకండ్ల ఈ వీడియోలో రామ్‌దేవ్‌ బాబా ఏనుగుపై కూర్చొని ఆశ్రమంలోని వ్యక్తులకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఏనుగు ఒక్కసారిగా పక్కకి కదలడంతో దానిపై కూర్చున్న రామ్‌దేవ్‌ బాబా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. కిందపడ్డ రామ్‌దేవ్‌ బాబా లేచి దుమ్ము దులుపుకొని నవ్వుతూ నడిచివెళ్లారు. రామ్‌దేవ్‌ బాబాకు సంబంధించి ఇలాంటి వీడియోనే ఆగస్టు నెలలో వైరల్‌ అయ్యింది. సైకిల్‌పై వెళ్తూ ఆయన ఫౌంటేన్‌ వద్ద జారి పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని