ర్యాపర్ నుదుటిపై ₹175 కోట్ల వజ్రం
ఎవరైనా నుదుటన బొట్టు పెట్టుకుంటారు. రోజుకో రకంగా, విభిన్న ఆకృతుల్లో ఉండే బొట్టు బిల్లలను పెట్టుకోవడమూ చూస్తూనే ఉంటాం. కానీ, అమెరికాకు చెందిన ర్యాప్ సింగర్ ఏకంగా నుదుటన శాశ్వతంగా ఒక ఖరీదైన వజ్రాన్ని అమర్చుకున్నాడు. తను అమర్చుకున్న వజ్రాన్ని చూపుతూ
(ఫొటోలు: లిల్ ఉజి వర్ట్ ఇన్‌స్టా-ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా నుదుటన బొట్టు పెట్టుకుంటారు. రోజుకో రకంగా, విభిన్న ఆకృతుల్లో ఉండే బొట్టు బిల్లలను పెట్టుకోవడమూ చూస్తూనే ఉంటాం. కానీ, అమెరికాకు చెందిన ర్యాప్ సింగర్ ఏకంగా నుదుటన శాశ్వతంగా ఒక ఖరీదైన వజ్రాన్ని అమర్చుకున్నాడు. తను అమర్చుకున్న వజ్రాన్ని చూపుతూ సోషల్‌మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టు చేశాడు. దీంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.
లిల్ ఉజి వర్ట్ అమెరికాలో ప్రముఖ ర్యాప్ సింగర్. అతనికి ఫ్యాన్సీగా కనిపించడం, మన బప్పీలహిరిలాగా ఆభరణాలు ధరించడమంటే మహా ఇష్టం. అయితే, తన ఇష్టాన్ని మరింత చాటుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేశాడు. గులాబి రంగులో ఉండే 10-11 క్యారెట్ల వజ్రాన్ని తన నుదటన తీయడానికి వీల్లేకుండా శాశ్వతంగా అమర్చుకున్నాడు. ఈ వజ్రం విలువ 24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.175కోట్లు). ఈ అరుదైన, ఖరీదైన వజ్రం కోసం ఐదేళ్లుగా డబ్బు చెల్లిస్తున్నట్లు లిల్ పేర్కొన్నాడు. ఇటీవల వజ్రాన్ని అమర్చుకున్న లిల్ దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ‘బ్యూటీ ఈజ్ పెయిన్’ అని కాప్షన్ ఇచ్చాడు.
లిల్ పోస్టులు చూసి అతడి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఓ అభిమాని ‘అంత ఖరీదైన వజ్రాన్ని ఉంగరంలో పెట్టుకోవచ్చు కదా?’ అని ప్రశ్నించగా.. లిల్ చమత్కారంగా సమాధానమిచ్చాడు. ‘నేను ఆ ఉంగరం పొగొట్టుకుంటే నుదుటన పెట్టుకున్న దానికన్న ఎక్కువ ఎగతాళి చేసేవారు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ వజ్రానికి ఇన్సూరెన్స్ ఉంది’’ అని జవాబిచ్చాడు. మరికొందరు నెటిజన్లు లిల్‌ను మార్వెల్ చిత్రాల్లో కనిపించే ‘విజన్’ పాత్రతో పోలుస్తూ, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, మీమ్స్‌తో సోషల్‌మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని కొనుగోలు చేయడమే ఒక విశేషమైతే.. దాన్ని నుదటన అమర్చుకోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.
ఇవీ చదవండి..
ఇతరులకు తనని అద్దెకిచ్చుకుంటున్నాడు
హస్తరేఖల్ని మార్చేస్తున్న థాయ్ కంపెనీ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
National Cinema Day: మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా టికెట్.. ఆఫర్ ఆ ఒక్క రోజే!
-
Shubman Gill: ‘శుభ్‌మన్ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్‌లో దంచికొడతాడు’
-
Navadeep: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. సినీనటుడు నవదీప్‌కు నోటీసులు
-
Bigg Boss Telugu 7: ఎవరూ ఊహించని టాస్క్.. అమర్దీప్, ప్రియాంక.. గుండు చేయించుకునేది ఎవరు?
-
BJP: భాజపా ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ముట్టడి... నరసాపురంలో ఉద్రిక్తత