TS News: కాంగ్రెస్‌ వరి దీక్షలో ఆసక్తికర సన్నివేశం!

ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సాదరంగా..

Updated : 27 Nov 2021 16:57 IST

హైదరాబాద్‌: రైతులు పండించే ప్రతి వరి గింజనూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే కొనాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన వరి దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా రేవంత్‌ నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. తనకు ఆ పదవి దక్కకపోవడంతో పార్టీ అధిష్ఠానం పట్ల, స్థానిక నేతల పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చారు. అయితే, పలుమార్లు వీరిద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు కొందరు పార్టీ సీనియర్‌ నేతలు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. గత కొన్ని రోజులుగా వీహెచ్‌ కూడా రాజీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో వరి దీక్షకు హాజరు కానున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ దీక్షావేదికపై రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పక్కపక్కనే కూర్చోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని