ఇంటి వద్దకే రెస్టారెంట్
కరోనా ఎంతోమంది జీవితాలను మార్చేసింది. అప్పటివరకు సవ్యంగా సాగిన జీవితం ఒక్కసారిగా కుదేలవడంతో కొందరు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఎంతోమంది జీవితాలను మార్చేసింది. అప్పటివరకు సవ్యంగా సాగిన జీవితం ఒక్కసారిగా కుదేలవడంతో కొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థిల్లో కూడా కొందరు యువకులు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టి ముందుకు సాగిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారే పార్థా మండల్.
బంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా, మెమారీకి చెందిన మండల్ 2013లో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రి పట్టా పొందారు. ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లిన మండల్ అక్కడ కొన్నాళ్లు షెఫ్‌గా పనిచేశారు. 2020లో కరోనా సంక్షోభం వల్ల హోటల్ రంగం దెబ్బతినడంతో ఉద్యోగం కోల్పోయారు. తప్పని పరిస్థితుల్లో స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే సమస్యలతో సతమతం అవుతున్న మండల్‌కి ఒక ఆలోచన తట్టింది. అందరికన్నా భిన్నంగా ఓ రెస్టారెంట్‌ను స్థాపించాలని అనుకున్నారు. దుబాయ్‌లో చూసిన మొబైల్ రెస్టారెంట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఓ ట్రక్కును రెండు అంతస్థుల రెస్టారెంట్లా మార్చేశారు. మొదటి అంతస్థులో వంటగదిని, పై అంతస్థులో డైనింగ్ హాల్‌నూ ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఒకే సారి 50 మంది కూర్చుని తినేవిధంగా ఈ రెస్టారెంట్‌ను రూపొందించారు. దీని ద్వారా పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఇంటి వద్దకే వచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు మండల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..