Ratan Tata: ‘ఆ కారు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్టు
25 ఏళ్ల క్రితం టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగంలో విడుదల చేసిన కారు తనకెంతో ప్రత్యేకమని టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.
ముంబయి: దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా (Ratan Tata) ఒకరు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని సరికొత్త ఉత్పత్తులతో కొత్త పుంతలు తొక్కించారు. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలు నిరుపమానం. టాటా గ్రూపు ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ఆయన టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రతన్ టాటా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ఆయన టాటా మోటార్స్ (Tata Motors) రూపొందించిన టాటా ఇండికా ( Tata Indica) కారుపై తనకున్న ప్రేమను చాటుతూ ఒక పోస్టు పెట్టారు. ఇండికా కారు పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘‘25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు గుర్తుచేస్తుంది. నా హృదయంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉంది’’ అంటూ రాసుకొచ్చారు.
టాటా మోటార్స్ సంస్థ తన ప్యాసింజర్ కార్ల తయారీ ప్రస్థానాన్ని 1998లో ఇండికాతో మొదలు పెట్టింది. దేశీయంగా రూపుదిద్దుకున్న ఇండికా చిన్న కార్ల శ్రేణిలో విడుదలైన అనతికాలంలోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన తొలి నాళ్లలో ఇండికా కారునే ఎక్కువగా ఉపయోగింవేవారు. అప్పట్లో క్యాబ్ అనే పదానికి ఇండికా కారు ప్రత్యమ్నాయంగా మారిపోయింది. తర్వాత ఇండికాలో విస్టా, మాంజా అనే మోడల్స్‌ను విడుదల చేసినప్పటికీ, అమ్మకాల్లో పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో 2018లో టాటా మోటార్స్ ఇండికా తయారీని నిలిపివేసింది. రతన్ టాటా ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 20 లక్షల మందిపైగా లైక్ చేశారు. అంతేకాకుండా టాటా ఇండికా కారుతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM