తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

 శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. ఈ పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు

Updated : 19 Feb 2021 06:00 IST

తిరుమల: శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. ఈ పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని