Arasavalli Temple: రథసప్తమి వేళ.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

రథసప్తమి వేళ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు.  

Updated : 28 Jan 2023 13:47 IST

శ్రీకాకుళం: రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తమ ఆరాధ్య దైవమైన సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సాధారణ భక్తులను పట్టించుకోలేదు. మరోవైపు క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్‌లో పర్యవేక్షణ అంతంతగా ఉండటంతో సాధారణ భక్తులు సైతం అదే వరుసలో వెళ్లిపోయారు. దీనిపై పలువురు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని