Ts News: మంత్రి గంగులతో చర్చలు సఫలం.. సమ్మె నుంచి వెనక్కి తగ్గిన రేషన్‌ డీలర్లు

పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో రేషన్‌ డీలర్లు సమావేశమయ్యారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వెనక్కి తగ్గినట్లు రేషన్‌ డీలర్లు ప్రకటించారు. 

Published : 06 Jun 2023 23:56 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ హామీతో సమ్మె నుంచి వెనక్కి తగ్గినట్టు రేషన్‌ డీలర్లు ప్రకటించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌. రేషన్‌ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించి.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీని తక్షణమే ప్రారంభిస్తున్నామని రేషన్‌ డీలర్ల జేఏసీ ఛైర్మన్‌ నాయికోటి రాజు, ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు. నేటి నుంచి రేషన్‌ షాపులు యధావిధిగా పనిచేస్తాయని రేషన్‌ డీలర్లు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలశాఖ మంత్ఇర గంటుల కమలాకర్‌ స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని