Chhattisgarh: రావణుడి తలలు దహనం కాలేదని ప్రభుత్వ ఉద్యోగిపై వేటు!

రావణ(Ravana) దహనంలో భాగంగా గడ్డి బొమ్మకు ఉన్న పది తలల్లో ఒక్కటి కూడా మంటల్లో కాలిపోకుండా అలాగే మిగిలిపోయిన ఘటనలో.. ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

Published : 08 Oct 2022 01:16 IST

రాయ్‌పూర్‌: రావణ దహనంలో భాగంగా గడ్డి బొమ్మకు ఉన్న పది తలల్లో ఒక్కటి కూడా మంటల్లో కాలిపోకుండా అలాగే మిగిలిపోయిన ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరి నగరపాలికలో ఈ ఘటన చోటుచేసుకుంది. దసరా (Dussehra) ఉత్సవాల్లో భాగంగా డీఎంసీ ఆధ్వర్యంలో స్థానికంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రావణుడి గడ్డి బొమ్మ శరీర భాగమంతా మంటల్లో బూడిదయినా.. పది తలలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.

దీంతో రావణుడి గడ్డి బొమ్మ తయారీ పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ.. క్లర్క్‌గా పనిచేస్తున్న రాజేంద్ర యాదవ్‌ను డీఎంసీ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం నగరపాలిక ప్రతిష్ఠను దెబ్బతీసిందని తెలిపింది. అసిస్టెంట్ ఇంజినీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజినీర్లు లోమస్ దేవాంగన్, కమలేశ్‌ ఠాకూర్, కమతా నాగేంద్రలకూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గడ్డిబొమ్మను తయారు చేసే బాధ్యతలు ఎవరికి అప్పగించామో.. వారిపై చర్యలు తీసుకున్నామని, చెల్లింపులు నిలిపేస్తామని ధమ్‌తరి మేయర్ విజయ్ దేవాంగన్ తెలిపారు. రావణుడి పది తలలు కాలిపోలేదంటే.. దాన్ని సరిగ్గా తయారు చేయలేదనే అర్థమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని