
TS News: షర్మిల ఇంటి ముందు రైతుల ఆందోళన
ఫిల్మ్‌నగర్: లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు రైతులు ముట్టడించేందుకు యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామని షర్మిల ఇటీవల ట్విటర్ ద్వారా ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తామని.. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్ చేశారు.
షర్మిల చేసిన ట్వీట్ రాయలసీమకు అన్యాయం చేసేలా ఉందంటూ ఈరోజు రైతులు ఆందోళనకు దిగారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులతో షర్మిల మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి
Advertisement