Yadadri temple: యాదాద్రి చరిత్రలో ఒక్కరోజే రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82000ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గత తెలిపారు.

Published : 14 Nov 2022 01:08 IST

యాదగిరిగుట్ట అర్బన్‌: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గత తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు. యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇవాళ రూ.కోటికిపైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టికెట్లకు రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని